రీసెంట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర భారీ హిట్ అయ్యిన చిత్రాల్లో ఒక రోరింగ్ హిట్ చిత్రం “ఛావా” కూడా ఒకటి. విక్కీ కౌశల్ అలాగే రష్మిక మందన్నా కలయికలో దర్శకుడు లక్ష్మణ్ రామ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ చిత్రం హిందీతో పాటుగా కేవలం తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో మాత్రమే రిలీజ్ అయ్యింది. ఇక ఈ హిస్టారికల్ సినిమా తర్వాత తెలుగు ఆడియెన్స్ ముందు మరో రీసెంట్ హిట్ బాలీవుడ్ సినిమా రాబోతుంది.
మరి ఆ చిత్రమే “కేసరి చాప్టర్ 2”. అక్షయ్ కుమార్ సహా మాధవన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి తెరకెక్కించిన ఈ చిత్రం కూడా హిందీలో హిట్ అయ్యి ఇప్పుడు తెలుగులో రిలీజ్ కి సిద్ధం అయ్యింది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ మే 23న తెలుగు స్టేట్స్ థియేటర్స్ లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. మరి ఈ చిత్రానికి తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.