టాలీవుడ్‌లో వెర్సటైల్ యాక్షట్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సత్యదేవ్. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ పాత్రలను తనదైన రీతిలో పర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక సత్యదేవ్ నుంచి రాబోతున్న లేటెస్ట్ చిత్రం ‘రావు బహదూర్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేడు రిలీజ్ చేశారు. దర్శకుడు వెంకటేష్ మహా డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సత్యదేవ్ అందరినీ స్టన్ చేశాడు. కాగా ఈ సినిమాను మహేష్ బాబు ప్రజెంట్ చేస్తుండటం మరో విశేషం. అయితే, మహేష్ బాబు హోం బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. గతంలో హీరో అడివి శేష్ నటించిన ‘మేజర్’ చిత్రాన్ని కూడా మహేష్ బాబు ప్రొడ్యూస్ చేశాడు. ఆ సినిమాను మహేష్ తన భుజాలపై వేసుకుని ప్రమోట్ చేశాడు. దీంతో ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఇప్పుడు సత్యదేవ్ నటిస్తున్న సినిమాను కూడా మహేష్ ప్రజెంట్ చేస్తుండటంతో ఈ సినిమాను కూడా ఆయన ప్రమోట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి అప్పుడు ‘మేజర్’తో అడివి శేష్‌కు అదిరిపోయే హిట్ అందించిన మహేష్, ఇప్పుడు సత్యదేవ్‌కు ‘రావు బహదూర్’ చిత్రంతో మరో హిట్ అందిస్తాడా అనేది వేచి చూడాలి.