టాలీవుడ్లో రాజ్యమేలుతున్న అడల్ట్ కామెడి

టాలీవుడ్లో రాజ్యమేలుతున్న అడల్ట్ కామెడి

Published on May 17, 2013 3:50 AM IST

Love-Cycle-and-Love-Touch
మారుతి తీసిన ‘ఈ రోజుల్లో’ ఒక సంచలనమైన హిట్ అయిన దగ్గరనుండి బూతు కామెడి తెలుగులో రాజ్యమేలుతుంది. క్రితం సంవత్సరం ‘బస్ స్టాప్’తో ఇదే జోనర్లో హిట్ కొట్టిన మారుతి మార్కు, ఈయేడు ‘3జి లవ్’ మొదలగు సినిమాల ద్వారా పైత్యం పెరిగింది. ‘లవ్ సైకిల్’, ‘లవ్ టచ్’ ఇవీ ఈ వారం మన ముందుకు రాబోతున్న సినిమాలు. ‘లవ్ సైకిల్’ లో ‘ఈ రోజుల్లో’ సినిమాలో నటించిన శ్రీ మరియు రేష్మ నటించగా, ‘లవ్ టచ్’లో జయంత్, దృతి మనకు పరిచయంకానున్నారు. ఈ రెండు సినిమాలు యువకుల ప్రేమతో బూతు కామెడీతో నింపేశారు. ఇవే కాక సందీప్ కిషన్ ‘మహేష్’ అనే మరో అడల్ట్ మూవీ ద్వారా మనముందుకు రానున్నాడు. వీరందరూ ఒక వర్గం ప్రేక్షకుల మెప్పు కోసమే ఈ సినిమాలు తీస్తున్నారు కనుక ప్రస్తుతానికి సజావుగానే సాగుతుంది. ఈ ట్రెండ్ టాలీవుడ్లో ఎంతకాలం సాగుతుందో చూద్దాం

తాజా వార్తలు