బాలీవుడ్ సినిమా తెరకెక్కిస్తున్న అత్యంత ఖరీదైన మరియు ప్రతిష్టాత్మాక చిత్రమే “రామాయణ”. రణబీర్ కపూర్ అలాగే సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో యష్, కాజల్ అగర్వాల్, సన్నీ డియోల్ లాంటి ఇతర బిగ్ స్టార్ మరో ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ హంగులతో తెరకెక్కిస్తున్నారు.
అయితే దీనికి ముందు బాలీవుడ్ నుంచి వచ్చిన ఆదిపురుష్ సినిమాకి అప్పట్లో మేకర్స్ ఇచ్చిన ఓ స్టేట్మెంట్ ఇప్పుడు రామాయణ విషయంలో వైరల్ గా వినిపిస్తుంది. రామాయణ సినిమాలో వానర సైన్యం కోసం ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లో కనిపించే తరహా టెక్నాలజీతో చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
అయితే సరిగ్గా ఆదిపురుష్ కి కూడా ఇదే మాట అప్పట్లో వినిపించింది. తాము కూడా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతోనే అవతార్ తరహాలో చేస్తున్నాం అన్నట్టుగా పలు వార్తలు వినిపించాయి. ఒకింత ఇలాంటి గ్రాఫిక్స్ వల్లే ఎక్కువ బడ్జెట్ కూడా అని వినిపించింది. మరి ఇప్పుడు రామాయణకి కూడా అదే తరహా టాక్ వినిపిస్తుంది.
మరి ఇందులో ఏ తరహా అవుట్ పుట్ ఉంటుందో చూడాలి. ఆదిపురుష్ లో మాత్రం ఆ వానర సేన ఎపిసోడ్స్ నుంచే విజువల్స్ తేలిపోయాయి. మరి రామాయణకి 4000 కోట్ల బడ్జెట్ అంటున్నారు కాబట్టి మరింత నాచురల్ విజువల్స్ నే ఆశించవచ్చు.