ఆసక్తికరంగా వున్న అడవి కాచిన వెన్నెల ‘ ట్రైలర్

ఆసక్తికరంగా వున్న అడవి కాచిన వెన్నెల ‘ ట్రైలర్

Published on Mar 9, 2014 1:31 PM IST

Adavi-Kachina-vennela--(11)

​అరవింద్ కృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా ‘అడవి కాచిన వెన్నెల’. ఈ సినిమా ట్రైలర్ ని ​ఈ మధ్య విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో అరవింద్ కృష్ణ , రిచర్డ్ రిషి, మీనా దీక్షిత్, పూజ రామచంద్రన్ ను ప్రధాన తారాగణంగా నటించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అందించిన పాటలకు జోక్యభట్ల సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా కి మార్తాండ్. కె వెంకటేష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ పై ఈ సినిమాని అక్కి విశ్వనాథ రెడ్డి స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 28న రాష్ట్రవ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది.

తాజా వార్తలు