‘అత్తారింటికి దారేది’ సినిమాని ఇంటర్నెట్ లో రిలీజ్ చేసిన పైరేట్స్ ని పట్టుకునే పనిని అత్తారింటికి దారేది ప్రొడక్షన్ టీం శరవేగంగా సాగిస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందరు ప్రముఖులు, హీరోలు మరియు అభిమానులు ఈ విషయంలో సపోర్ట్ ఇవ్వడంతో అత్తారింటికి దారేది టీం మచిలీపట్నంలో కొంతమంది అనుమానితుల్ని అరెస్ట్ చేసారు.
ఈ చిత్ర ప్రొడక్షన్ మరి కొద్ది రోజుల్లో ఇంకొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఫిల్మ్ చాంబర్ యాంటీ పైరసీ డివిజన్ కూడా ఇక్కడ మరియు అమెరికాలోని పైరేట్స్ ని ట్రేస్ చెయ్యడానికి ఈ చిత్ర టీంకి సాయపడుతోంది. అలాగే నిర్మాతలు ఇలా చేసిన ఓవర్సీస్ పైరేట్స్ పై కాపీరైట్ చట్టం కింద వారిపై లీగల్ గా యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు.
.
అత్తారింటికి దారేది ఈ శుక్రవారం(సెప్టెంబర్ 27న) భారీ ఎత్తున రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ – సమంత జంటగా నటించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసిబివిఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించాడు.