పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా కళ్ళుచెదిరే కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తుంది. అయితే ఇప్పుడు అనుకోని రాజకీయ నేపధ్యాల నడుమ సీమాంధ్రలో ఈ సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి.
రోజువారీ పనులు చేసుకునే చాలా సంస్థలు సీమాంధ్రలో తమతమ పనులను నిలిపివేశాయి. థియేటర్లు కూడా ఈ జాబితాలో వుండడం కొసమెరుపు. ఈ పరిస్థితి ఇలాగే సోమవారం వరకూ కొనసాగే అవకాశంవుంది. ఏ సినిమాకు అయినా వారంతరపు కలెక్షన్లే కీలకం, అందుకు ఇదే గనుక జరిగితే సినిమా కలెక్షన్లు దెబ్బతినే అవకాశాలు పుష్కలం. అప్పుడు సినిమా బాగా ఆడుతున్న నైజాం మరియు ఓవర్ సీస్ కలెక్షన్లే ఇంక ఆదాయానికి ఆధారంకానున్నాయి
ఈ సినిమాలో సమంత మరియు ప్రణీత హీరోయిన్స్. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఇప్పటికే పలు ఏరియాలలో గతంలో నెలకొన్న రికార్డులను తిరగరాసింది