సినీనటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఖుష్బూ ఏమీ చేసినా ఆసక్తిగానే ఉంటుంది. కాగా తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేర ఆమె ఓ రాజీనామా లేఖను కూడా రాసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించి.. పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీలోని ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు నేతల పై కూడా కొన్ని ఆరోపణలు చేశారు.
పార్టీలోని కొందరు పెద్ద నేతలు వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా ప్రజలతో సంబంధం లేకుండా ఉంటున్నారని.. పైగా పార్టీ కోసం పనిచేస్తున్న తనలాంటి వారిని అణచివేస్తున్నారని ఖుష్బూ సోనియాకు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇక తనకు పార్టీలో సహకరించిన రాహుల్ గాంధీకి ఖుష్బూ కృతజ్ఞతలు తెలిపారు. ఖుష్బూ సోమవారం బీజేపీలో చేరే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో రజనీ సరసన ఖుష్బూని హీరోయిన్ గా నటిస్తోంది. గ్లామర్ పరంగా ఇప్పటికీ ఏ మాత్రం వంక పెట్టలేని విధంగా ఉండే ఖుష్బూ.. మరి రజిని సరసన ఈ లేట్ వయసులో ఎలా నటిస్తోందో ఎలాంటి రొమాన్స్ చేస్తోందో చూడాలి.