కమెడియన్‌గా, నటుడిగా తెలుగు సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు ప్రవీణ్. ఆయన తొలిసారిగా హీరోగా నటిస్తున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఎస్‌జే శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ ఇతర ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మిస్తున్నారు. ఈ నెల 8న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సంధర్బంగా నటుడు ప్రవీణ్‌తో జరిపిన ఇంటర్వ్యూ ఇది.
బకాసుర రెస్టారెంట్ ఎలాంటి కథ?
ఈ సినిమా ఐదు పాత్రలతో నడుస్తుంది. ఇందులో కథను నడిపించే పరమేష్ అనే పాత్రలో నేను కనిపిస్తాను. నా పాత్రలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది. నా పాత్రకు ఉండే ఓ యాంబిషన్ ఎలా ఫుల్‌ఫిల్ అయ్యింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
మీ పాత్ర చుట్టే కథ నడవడం, మీరు హీరోగా నటించడం వల్ల ఎమైనా ప్రెజర్‌గా ఫీలవుతున్నారా?
నిజం చెప్పాలంటే ఇది కొంచెం బరువే. పర్‌ఫార్మెన్స్ వైజ్ నాది రెగ్యులర్ పాత్ర కాదు. కథలో హారర్, థ్రిల్లర్, మైథాలజీ ఇలా అన్నీ మిక్స్ అయ్యాయి. ఐదు పాత్రలున్న కథను నడిపించే పాత్ర కావడంతో కాస్త టెన్షన్‌గానే ఉంది. అయితే సినిమాను దర్శకుడు ఎంతో క్లారిటీగా తెరకెక్కించాడు. అయితే సినిమాను మంచి ప్రమోషన్‌తో బయటికి తీసుకరావాల్సిన బాధ్యత నాపై ఉంది. ఈ విషయంలో నాకు సినీ పరిశ్రమలోని అందరూ సహకరిస్తున్నారు.
అంటే ఈ సినిమాలో మీ పాత్రలో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందా?
ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది. నా పాత్రలో ఎమోషన్‌ను పండించడమే నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. ఓ పెయిన్‌ఫుల్ ఎమోషన్‌తోనే ఈ కథ ఎండ్ అవుతుంది.
తిండిబోతు దెయ్యం మిమ్ములను ఇబ్బంది పెడుతుందా?
ఇదొక కాన్సెప్ట్ కథ. ఆ తిండిబోతు దెయ్యం పెట్టే ఇబ్బంది చాలా ఎంటర్‌టైనింగ్‌గా.. ఎమోషన్‌ల్‌గా ఉంటుంది.
కమెడియన్‌గా హీరోగా మారితే కమెడియన్‌గా అవకాశాలు తగ్గిపోతాయోనని అంటుంటారు?
అలాంటిదేమీ లేదు. అసలు నేను హీరోగా ఫీలయితే అలాంటి ఫీలింగ్ అందరిలో వస్తుంది. నేను ఓ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నాననే భావనలో మాత్రమే ఉన్నాను .ప్రస్తుతం నేను విశ్వంభర, ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ జాతర, లెనిన్, ఆకాశంలో ఓ తార చిత్రాలతో బిజీగా ఉన్నాను. నాకు దర్శకుడి ఎలాంటి పాత్రను ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
ఈ సినిమాలో ఉండే స్పెషాలిటీ ఏమిటి?
ముఖ్యంగా పతాక సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. మన జీవితంలోకి వచ్చిన మంచి స్నేహితుడు అనివార్యా కారణాల వల్ల వెళ్లిపోవాల్సి వస్తే మనలో ఓ పెయిన్ ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఈ సినిమాలో కూడా ఉంటుంది. ఇది అందరి హృదయాలకు హత్తుకుంటుంది.
ఈ సినిమాను చూసి థియేటర్ నుంచి బయటికి వచ్చే ఆడియన్స్‌కు కలిగే ఫీలింగ్ ఏమిటి?
థియేటర్‌లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఎంజాయ్ చేసి… పతాక సన్నివేశాలు చూసిన తరువాత ఓ మంచి ఎమోషన్‌తో.. కాసేపు అదే ఫీల్‌లో థియేటర్ నుంచి బయటికొస్తాడు.