కామెడీ కింగ్ అల్లరి నరేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా అయిన ‘యాక్షన్ 3డి’ ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ ఈ నెల 10న పుర్తికావచ్చు. ఈ సినిమాలో అల్లరి నరేష్, ‘కిక్’ శ్యామ్, వైభవ్, రాజు సుందరం ప్రధాన పాత్రధారులు. బ్రహ్మానందం, సుదీప్ ముఖ్యమైన పాత్రలలోకనిపిస్తారు.
ఈ సినిమాను అనీల్ సుంకర దర్శకత్వం వహించడమే కాక తానే నిర్మిస్తున్నాడు. బప్పి లహరి- బప్పా లహరి సంయుక్తంగా సంగీతం అందించారు. భారీ సాంకేతిక విలువలతో ఈ సినిమాను తీసారు. ఈ ‘యాక్షన్ 3డి’ సినిమా ఇండియాలోనే మొదటిసారిగా 3డి పరిజ్ఞానంతో తీసిన కామెడీ సినిమాగా చరిత్ర సృస్టింనుంది.
స్నేహా ఉల్లాల్, నీలం ఉపాధ్యాయ్, కామ్నా జట్మలాని మరియు స్నేహ ఈ సినిమాలో హీరోయిన్స్