విక్ర‌మ్ -ధ్రువ్ ల కలయికలో యాక్షన్ డ్రామా !

విక్ర‌మ్ -ధ్రువ్ ల కలయికలో యాక్షన్ డ్రామా !

Published on Sep 12, 2020 11:11 PM IST

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ‘ధృవ్’ తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే యాంగ్రీ యంగ్ మ్యాన్ గా బాగానే పేరు తెచ్చుకున్నాడు. కాగా తాజాగా ఈ తండ్రీకొడుకులిద్దరూ ఒకే సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటిస్తున్నారట. ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొంద‌నుంద‌ని తెలుస్తోంది. పైగా విక్ర‌మ్-ధ్రువ్ ల కలయిక అనేసరికి మొత్తానికి ఈ సినిమా పై సౌత్ సినీ ప్రేక్షకులకు మంచి ఆసక్తి ఉంటుంది.

కాగా వచ్చే ఏడాది మార్చి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అన్నట్టు కార్తిక్ సుబ్బరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతుందట. సహజంగా కార్తిక్ సుబ్బ‌రాజ్ అంటేనే మంచి కంటెంట్ ఉంటుందనే నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నాడు. మరి అలాంటి డైరెక్టర్ నుండి మల్టీస్టారర్ అంటే బాగానే విషయం ఉంటుంది. ఇక అర్జున్ రెడ్డి రీమేక్ తో ధ్రువ్ త‌మిళ తెర‌కు ప‌రిచ‌యం అయినా.. ఆ సినిమాతో పెద్దగా స్టార్ డమ్ ను అయితే తెచ్చుకోలేకపోయాడు. దాంతో తన రెండో సినిమాగా తన తండ్రి విక్ర‌మ్ తో కలిసి న‌టించ‌బోతున్నాడు.

తాజా వార్తలు