అల్లరి నరేష్, వైభవ్ రెడ్డి, రాజు సుందరం మరియు శ్యామ్ నటిస్తున్న ‘యాక్షన్ 3డి’ సినిమా పూర్తి కావచ్చింది. ఈ చిత్రం షెడ్యూల్ ఫిబ్రవరిలో చెన్నైలో మొదలైంది. సినిమాకి సంబంధించి ఆఖరి పాట కూడా మొదలయింది. దీంతో చిత్రీకరణ పూర్తవుతుంది. ‘బిందాస్’, ‘అహ నా పెళ్ళంట’ సినిమాలను నిర్మించిన అనిల్ సుంకర ఈ చిత్రంతో దర్శకుడిగా మారనున్నాడు. “ఆఖరి పాట షూటింగ్ జరుగుతుంది. ఇది తప్పకుండా అందరికీ కనువిందు కలిగిస్తుంది. ‘యాక్షన్ 3డి’ కౌంట్ డౌన్ మొదలైందని ” ట్వీట్ చేసాడు.
ఈ చిత్రానికి బప్పా లహరి- బప్పి లహరి సంయుక్తంగా సంగీతం అందించారు. దీంట్లో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే కె. రాఘవేంద్ర రావు పాటల స్టైల్లో అల్లరి నరేష్ – నీలం ఉపాధ్యాయ్ మీద ఓ పాటను తీశారు. ఈ చిత్రంలో స్నేహ ఉల్లాల్, రీతు బర్మేచ, కామ్నా జఠ్మలాని మరియు నీలమ్ ఉపాధ్యాయ్ హీరోయిన్స్ నటిస్తున్నారు ఏప్రిల్ 11న ఈ సినిమా విడుదల కానుంది.