మే రెండో వారంలో విడుదల కానున్న యాక్షన్ 3డి

మే రెండో వారంలో విడుదల కానున్న యాక్షన్ 3డి

Published on Apr 10, 2013 1:39 AM IST

Action-3D-

అల్లరి నరేష్, వైభవ్, శ్యాం , రాజు సుందరం నటిస్తున్న ‘ యాక్షన్ 3డి ‘ మే రెండో వారంలో భారీ విడుదలకు సిద్ధం అవుతుంది . ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మానంతరపు పనులు వేగంగా జరుగుతున్నాయి . ‘యాక్షన్ ‘ తెలుగు లో నిర్మింపబడుతున్న తొలి కామెడి 3డి చిత్రం దర్శకుడిగా మారిన నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రం పై చాలా ఖర్చు పెట్టారు . ఈ చిత్రం లో పనిచేసిన నటీనటులందరికి ఇదే తొలి 3డి చిత్రం అవ్వడం వల్ల షాట్ బాగా రావడానికి చాలా కష్టపడ్డారు .

ఈ చిత్రం లో నీలం ఉపాధ్యాయ, స్నేహ ఉల్లాల్ , రితు బర్మేచ మరియు కామ్న జట్మలాని ఇతర పాత్రలు పోషిస్తున్నారు . ‘ఈగ’లో అలరించిన కిచ్చ సుదీప్ ఈ చిత్రం లో ముఖ్య భూమిక పోషిస్తున్నారు . బప్ప మరియు బప్పి లహరి సంగీతం అందించిన ఈ చిత్రంలో ఓ పాట కె. రాఘవేంద్రరావు పాటల చిత్రీకరణ కు గౌరవార్ధంగా చిత్రీకరిస్తున్నారు .

తాజా వార్తలు