బ్యాంకాక్ వెళ్లనున్న యాక్షన్(3D) చిత్ర బృందం

బ్యాంకాక్ వెళ్లనున్న యాక్షన్(3D) చిత్ర బృందం

Published on Oct 13, 2012 8:40 PM IST


అల్లరి నరేష్, వైభవ్ రెడ్డి, శ్యాం ,రాజ సుందరం, స్నేహ ఉల్లాల్, కామ్న జేత్మలాని మరియు నీలం ఉపాధ్యాయ్ లు ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రం “యాక్షన్” త్వరలో బ్యాంకాక్లో చిత్రీకరణ జరుపుకోనుంది. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం 40 మంది చిత్ర బృందం రేపటి నుండి ప్రారంభం అవ్వనున్న షెడ్యూల్లో వీరు పాల్గొనడానికి బ్యాంకాక్ వెళ్లనున్నారు. ఈ చిత్రం పది రోజుల పాటు అక్కడ చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రంతో అనిల్ సుంకర దర్శకుడిగా పరిచయం కానున్నారు. రామ బ్రహ్మ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి బప్పి-బప్పా లహరి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 3Dలో చిత్రీకరిస్తున్నారు తెలుగు మరియు తమిళంలో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యనున్నారు.

తాజా వార్తలు