‘ఆషికి 2’ తెలుగు రీమేక్ లాంచ్ ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. ఆదిత్య కపూర్ శ్రద్ధ కపూర్ జంటగా నటించిన ఈ చిత్ర మాతృక హిందీ లో ఘన విజయం సాధించింది. అదే విజయాన్ని తెలుగు లో కూడా సాధించాలని నిర్మాతలు ఆశిస్తున్నారు. చాలా విరామం తర్వాత సచిన్ జోషి తెలుగు లో హీరో గా తిరిగి నటించనున్నాడు. సంజయ్ దత్ మేన కోడలు నజియ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ రీమేక్ లాంచ్ కి జెమినీ కిరణ్ జయంత్ రంజిత్ రెడ్డి హాజరు అయ్యారు. బండ్ల గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జయ రవీంద్ర దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ సింగల్ షెడ్యూల్ లో పూర్తి చేసి జూన్ లో విడుదల చేస్తాం. “‘ఆషికి 2’ లో పాటలు చాలా బాగుంటాయి ఆ చిత్రం లోని బాణీ లనే తెలుగు లో కూడా వాడాలని అనుకుంటున్నాం” అని బండ్ల గణేశ్ తెలిపారు. ఈ చిత్రం హైదరాబాద్ గోవా పారిస్ ల లో చిత్రీకరిస్తాం అని కూడా తెలిపారు.
అంకిత్ తివారి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చంద్రబోస్ సాహిత్యం అందించనున్నారు.