ఆషికీ 2 సినిమా రీమేక్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. ఈ సినిమాద్వారా చాన్నాళ్ళు తెలుగు తెరకు దూరమైనా సచిన్ జోషి మరోసారి తెరపై కనిపించనున్నాడు. ఈ సినిమా లో హీరోయిన్ గా నజియా హుస్సేన్ నటిస్తుంది. తెలుగులో ఈమెకు ఇదే తొలి సినిమా
ఈ చిత్ర ఒరిజినల్ మాతృకలో ఆదిత్య రాయ్, శ్రద్ధా కపూర్ లు నటించారు. గాయిని ఎదుగుదల కోసం తాపత్రేయ పడి చివరికి ఆమెతోనే ప్రేమలో పడే ఒక మ్యుజీషియన్ పాత్రలో ప్రధాన పాత్రలు నటించాయి. హిందీ వెర్షన్ లో విషాదాంతం వున్నా మన నేటివిటి కి తగ్గట్టు తగిన మార్పులు చేస్తున్నారని సమాచారం.
ఈ సినిమాలో ప్రధాన భాగం హైదరాబాద్, గోవా మరియు ప్యారిస్ లలో చిత్రీకరించనున్నారు
జయ రవీంద్ర దర్శకుడు, బండ్ల గణేష్ నిర్మాత


