హైదరాబాద్ నోవోటల్ లోఇంతకుముందు నాని ఆహా కళ్యాణం ఆడియో లాంచ్ జరిగింది. ఈ వేడుకలో రానా, సునీల్, దిల్ రాజు, కరుణాకరన్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా మెరిసాడు . దిల్ రాజు మొదటి సి.డి ని ఆవిష్కరించి నానికి అందజేశాడు
ఈ సినిమా గురించి నాని మాట్లాడుతూ “యష్ రాజ్ సంస్థలో రిమేక్ లో నటించాలి అంటే కాస్త ఆలోచించాను. కానీ ఈ సినిమా ఒరిజనల్ వెర్షన్ ను చూసాక ఇంతకంటే మంచి సినిమా నా కెరీర్ లో రాదని నిశ్చయించుకున్నా. దక్షిణాదిన యష్ రాజ్ సంస్థతో కలిసి పనిచెయ్యడం నా అదృష్టం” అని తెలిపాడు. వాణికపూర్ తో సహా అందరికీ నా కృతజ్ఞతలు
గోకుల్ కృష్ణ దర్శకుడు. ధరన్ కుమార్ సంగీతం అందించాడు. ఫిబ్రవరి లో ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ మనముందుకు రానుంది