వాయిదాపడిన ఆహాకళ్యాణం ఆడియో విడుదల

వాయిదాపడిన ఆహాకళ్యాణం ఆడియో విడుదల

Published on Jan 23, 2014 2:21 AM IST

Aaha-Kalyanam
నానీ, వాణికపూర్ లు జంటగా నటిస్తున్న ఆహా కళ్యాణం ఆడియో విడుదల వాయిదాపడింది. ముందుగా ఈ వేడుకను జనవరి 23న విడుదలచేద్దాం అనుకున్నారు. కానీ ఈరోజు నాగేశ్వరరావు మరణం వల్ల కుదేలైన సినీ ఇండస్ట్రీ ఈ వారం ఎటువంటి కార్యక్రమాలను జరుపటంలేదు. మారిన తేదిని త్వరలోనే ప్రకటిస్తారు

ఈ సినిమా బ్యాండ్ భాజా భారాత్ కు రిమేక్. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో విడుదలకానుంది. గోకుల్ కృష్ణ దర్శకుడు. ఆదిత్య చోప్రా యష్ రాజ్ ఫిలిమ్స్ పై నిర్మిస్తూ మొదటి సారిగా దక్షిణాదిన సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు. ధరన్ ధరన్ కుమార్ సంగీతదర్శకుడు

ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదలకానుంది. నాని నటించిన జండాపై కపిరాజు ఫిబ్రవరి 14న మనముందుకురానుంది

తాజా వార్తలు