మూడేళ్ళ క్రితం మహేష్ శ్రీను వైట్ల కలిపి చూపించిన దూకుడు సినిమాను అంతత్వరగా ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో ఆగడు సినిమా రానుంది. తమన్నా ఈ చిత్రంలో హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటిలో జరుగుతుంది
నానాక్రమ్ గూడ లో తీసిన షూట్ లో పాల్గూన్న మహేష్ బాబు ఇప్పుడు ఆర్.ఎఫ్.సీ లో వేసిన స్పెషల్ పోలీస్ స్టేషన్ సెట్ లో నటిస్తున్నాడు. తరువాత ఈ చిత్ర యూనిట్ గుజరాత్ లో మరో షెడ్యూల్ ను కొనసాగిస్తారు
థమన్ సంగీతాన్ని అందిస్తాడు. ఈ భారీ బడ్జెట్ సినిమాను 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది