‘రఫ్’ టైటిల్ తో రానున్న ఆది

‘రఫ్’ టైటిల్ తో రానున్న ఆది

Published on May 19, 2013 1:00 PM IST

Rough
‘సుకుమారుడు’ సినిమా తర్వాత ఆది త్వరలోనే సుబ్బారెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు లోగోని ఈ రోజు హైదరాబాద్లో లాంచ్ చేసారు. రొమాన్స్ మిక్స్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకి ‘రఫ్’ అనే టైటిల్ ని పెట్టారు. ‘కెరటం’ సినిమా ద్వారా పరిచయమైన రాకుల్ ప్రీత్ సింగ్ ఆది సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే 50% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రియల్ స్టార్ శ్రీ హరి కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అభిలాష్ మాధవరం ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్.

తాజా వార్తలు