ఆది న్యూ సినిమా టైటిల్ ‘గాలిపటం’?

ఆది న్యూ సినిమా టైటిల్ ‘గాలిపటం’?

Published on Mar 11, 2014 1:43 AM IST

aadi-in-rough

గత సంవత్సరం సుకుమారుడు సినిమాతో కనిపించిన హీరో ఆది ఈ సంవత్సరం రెండు సినిమాల్లో కనిపించనున్నాడు. ఈ సంవత్సరం మొదట్లో రవిచావలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్యార్ మే పడిపోయానే’ రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని నానక్రామ్ గూడా లో గల రామానాయుడు స్టూడియోస్ లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ లో ఉంది. అలాగే సంపత్ నంది నిర్మించనున్న మరో సినిమా సెట్స్ లో కూడా ఆది పాల్గొంటున్నాడు. ఆది హీరోగా ఎరికా ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ‘గాలిపటం’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం. ఈ సినిమాకి కొత్త దర్శకుడు నవీన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమాలో తన పాత్ర కొత్తగా ఉంటుందని ఆది తెలిపాడు. ఈ సినిమాకు సంబందించిన మరింత సమాచారం త్వరలో తెలిసే అవకాశం వుంది.

ఈ రెండు సినిమాలు కాకుండా ఆది సుబ్బా రెడ్డి తీయనున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రఫ్’ సినిమాలో కూడా నటించనున్నాడు. ఈ సినిమాలో ఆది సరసన రాకుల్ ప్రీత్ నటించనుంది. ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదల అయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు