త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఆది కొత్త సినిమా

త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఆది కొత్త సినిమా

Published on Nov 17, 2013 7:51 PM IST

Aadi
​ఆది నటిస్తున్న రఫ్ సినిమా షూటింగ్ ముగిసిన తరువాత ఆది నటించనున్న సినిమా టైటిల్ ‘ప్యార్ మైనే పడిపోయా’. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది సరసన శాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న రెండవ సినిమా ఇది. మొదటగా వీరిద్దరూ కలిసి ‘లవ్లీ’ సినిమాలో నటించారు. రవి చావలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె కె రాధామోహన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని అక్టోబర్ లో అధికారికంగా లాంచ్ చేశారు. ఈ సినిమా ఈ నెల చివరి వారం నుండి హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకోనుంది. అనుప్ రూబెన్స్ సంగీతాన్ని సందిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

తాజా వార్తలు