మార్చి10న ఆది శంకర ఆడియో రిలీజ్

మార్చి10న ఆది శంకర ఆడియో రిలీజ్

Published on Mar 9, 2013 4:00 PM IST

sri-jagadguru-adi-shankaraజగద్గురువు ఆది శంకరాచార్య జీవిత నేపధ్యాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నిస్తున్న జె. కె. భారవి ‘జగద్గురు ఆది శంకర’ సినిమా ఆడియో ఈ నెల 10న విడుదల కానుంది. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో లలిత కళా తోరణం భారీ ఎత్తున జరగనున్న ఈ వేడుకకి వేదిక కానుంది. ఈ వేడుకకి పలువురు ప్రముఖ తారలు హాజరు అవుతారని సమాచారం. ఆ పరమ శివుని అవతారమైన ఛండాలుడి పాత్రని నాగార్జున పోషిస్తున్నారు. ఈ పాత్ర చిత్రీకరణ కే. రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో జరిగింది. మోహన్ బాబు మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

ఇందులో ఆది శంకరాచర్యగా కౌశిక్ నటించగా, శ్రీ రామచంద్ర,కామ్నా జట్మలాని మరియు శ్రీ హరి ప్రధాన పాత్రదారులు. నాగ శ్రీవాత్సవ్ సంగీతం అందించాడు. పి. సి. హెచ్ దాస్ సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రానికి చిరంజీవి గాత్రదానం అందించడం మరో విశేషం. ఆయన డబ్బింగ్ కుడా ఇటీవలే పూర్తిచేసుకున్నారు.

తాజా వార్తలు