సంపత్ నంది అసిస్టెంట్ డైరెక్షన్ లో ఆది కొత్త మూవీ

సంపత్ నంది అసిస్టెంట్ డైరెక్షన్ లో ఆది కొత్త మూవీ

Published on Feb 11, 2014 6:30 PM IST

Aadi
‘ప్రేమ కావాలి’, ‘లవ్లీ’, ‘సుకుమారుడు’ సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైన హీరో ఆది. ఆది ప్రస్తుతం ‘ప్యార్ మే పడిపోయానే’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆది కొత్త డైరెక్టర్ నవీన్ గాంధీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ‘రచ్చ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సంపత్ నంది శిష్యుడే నవీన్ గాంధీ.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఫిబ్రవరి 14న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాని సంపత్ నంది నిర్మించాలని కూడా చూస్తున్నారని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సంపత్ నంది ప్రస్తుతం ‘గబ్బర్ సింగ్ 2’ పనుల్లో బిజీగా ఉంటే, ఆది ‘ప్యార్ మే పడిపోయానే’ సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.

తాజా వార్తలు