బ్లాక్ బస్టర్ ‘సైయారా’ ఆ సీన్ మొత్తం కాపీ.. సోషల్ మీడియాలో వైరల్!

బ్లాక్ బస్టర్ ‘సైయారా’ ఆ సీన్ మొత్తం కాపీ.. సోషల్ మీడియాలో వైరల్!

Published on Jul 22, 2025 7:02 PM IST

Saiyaara

రీసెంట్ గా బాలీవుడ్ లో సెన్సేషన్ సెట్ చేస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది “సైయారా” అని చెప్పాలి. ఆహాన్ పాండే హీరోగా అనీత్ పద్దా హీరోయిన్ గా దర్శకుడు మోహిత్ సూరి తెరకెక్కించిన లవ్ డ్రామానే ఇది. అయితే ఒక ఊహించని హైప్ నడుమ సినిమా వచ్చి భారీ హిట్ అయ్యింది. రికార్డు వసూళ్లు హిందీ మార్కెట్ లో మైంటైన్ చేస్తూ వస్తున్న ఈ సినిమాపై కాపీ మరకలు పడ్డాయి.

ఈ బ్లాక్ బస్టర్ సినిమాలో ఒక సీన్ ని ఎప్పుడో వచ్చిన కొరియన్ సినిమాలో సీన్ తో పోల్చి సోషల్ మీడియాలో నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ఇంతలా లేపిన సినిమాలో సీన్స్ ని కొరియన్ చిత్రం అది 2004లో వచ్చిన ‘ఏ మూమెంట్ ఆఫ్ రిమెంబర్’ నుంచి తస్కరించి పెట్టుకున్నారని రెండు సీన్స్ పక్క పక్కన పెట్టి సోషల్ మీడియాలో పోలుస్తున్నారు. దీనితో ఈ క్లిప్ ఇపుడు వైరల్ గా మారింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు