ఉయ్యాలా జంపాలా ఆడియోలో సందడి చేయనున్న స్టార్స్

uyyala-jampala
రాజ్ తరుణ్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఉయ్యాలా జంపాలా’ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఆడియో ఈ రోజు శిల్పకళా వేదికలో జరగనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ వేడుకకి నాగార్జున, నాగ చైతన్య, రానా దగ్గుబాటి, నానిలతో పాటుగా పలువురు స్టార్స్ విచ్చేసి సందడి చేయనున్నారు.

ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమని ఆవిష్కరించే ఈ క్యూట్ రొమాంటిక్ లవ్ స్టొరీకి విరించి వర్మ డైరెక్టర్. ఇటీవల జరిగిన ఓ ప్రైవేట్ స్క్రీనింగ్ లో ఈ సినిమా చూసిన చాలా మంది విరించి వర్మ సూపర్బ్ ఫిల్మ్ తీసాడని అంటున్నారు. అలాగే రాజ్ తరుణ్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్ అవుతుందని చెబుతున్నారు.

గతంలో అష్టా – చమ్మా సినిమాని నిర్మించిన రామ్మోహన్ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ తో కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఇటీవలే నాగార్జున కూడా కొత్త వారి నటన చాలా బాగుందని, అలాగే మంచి సినిమాని అందించబోతున్నామని చాలా ఆనందంగా ఉందని తెలిపాడు. సన్నీ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

Exit mobile version