అనుష్క 15 ఇయర్స్ జర్నీ పై స్పెషల్ వీడియో..!

అనుష్క 15 ఇయర్స్ జర్నీ పై స్పెషల్ వీడియో..!

Published on Mar 10, 2020 11:23 PM IST

టాలీవుడ్ లో హీరోలకు సమానమైన ఇమేజ్ కలిగిన ఒకే ఒక హీరోయిన్ అనుష్క. ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 15ఏళ్ళు అవుతుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా 2005లో వచ్చిన సూపర్ మూవీతో ఆమె వెండి తెరకు పరిచయమయ్యారు. ఈ పదిహేనేళ్ల కాలంలో అందరూ స్టార్ హీరోల సరసన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో నటించిన అనుష్కకు అరుంధతి చిత్రం విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక బాహుబలి చిత్రాలతో ఆమె చేసిన దేవసేనగా జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు.

కాగా అనుష్క సినీ పరిశ్రమలో 15ఏళ్ల ప్రస్థానం విజయవంతంగా ముగించుకున్న తరుణంలో ఆమెపై ఓ స్పెషల్ వీడియో విడుదల చేయనున్నారు. ఈనెల 12న నిశ్శబ్దం మూవీ ఈవెంట్ ఉన్న నేపథ్యంలో ఆ ఈవెంట్ లో ఈ స్పెషల్ వీడియో ప్రదర్శించనున్నారు. ఇక దర్శకుడు హేమంత్ మధుకర్ తెరకెక్కించిన నిశ్శబ్దం మూవీ వచ్చే నెల 2న విడుదల కానుంది. సస్పెన్సు థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుష్క మూగదైన పెయింటింగ్ ఆర్టిస్ట్ రోల్ చేస్తున్నారు.

తాజా వార్తలు