“రాబిన్ హుడ్” నుంచి అదిరిన “ఆదిపురుష్” నటుడు పోస్టర్!

“రాబిన్ హుడ్” నుంచి అదిరిన “ఆదిపురుష్” నటుడు పోస్టర్!

Published on Feb 5, 2025 12:02 PM IST

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా “రాబిన్ హుడ్” కోసం అందరికీ తెలిసిందే. నితిన్ అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమా నిజానికి గత ఏడాదిలోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఈ ఏడాదికి మేకర్స్ షిఫ్ట్ చేశారు. ఇక ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా సాలిడ్ అప్డేట్ వచ్చింది.

ఈ చిత్రంలో “ఆదిపురుష్” సినిమాలో భజరంగ్ పాత్రలో కనిపించిన బాలీవుడ్ నటుడు దేవదత్త జి నాగ్ విలన్ రోల్ చేస్తున్నట్టుగా తనపై సాలిడ్ పోస్టర్ ని మేకర్స్ ఇపుడు తన బర్త్ డే కానుకగా రిలీజ్ చేశారు. మరి ఈ సరికొత్త లుక్ లో ఈ నటుడు మంచి డైనమిక్ గా కనిపిస్తుండగా తాను సామి అనే రోల్ లో కనిపించనున్నట్టుగా మేకర్స్ చెబుతున్నారు.

మరి ఇటీవల మరో తెలుగు సినిమా “దేవకీ నందన వాసుదేవ” సినిమాలో కూడా విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక రాబిన్ హుడ్ లో తాను ఎలా నటిస్తాడో చూడాలి. మరి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన ఈ సినిమా ఈ మార్చ్ 28న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు