మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా కొత్త దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కించిన సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రమే “మాస్ జాతర”. ఈ సినిమా థియేటర్స్ లో బాహుబలి ది ఎపిక్ తో పోటీకి వచ్చింది. పైగా గట్టి ప్రమోషన్స్ కూడా జరుపుకోలేదు. ఇలానే ఫైనల్ గా ఓటిటి విడుదలకి వచ్చింది. మరి ఈ సినిమా థియేటర్స్ లో కంటే ఓటిటిలోకి వచ్చాక ఒకింత ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ ని అందుకుంటుంది.
నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక చూసిన చాలా మంది ఆడియెన్స్ ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుండడం గమనార్హం. థియేటర్స్ లో రిలీజ్ అయినపుడు వచ్చినంత నెగిటివ్ గా ఏం లేదని యాక్షన్, మ్యూజిక్ పార్ట్ లకి కూడా నెటిజన్స్ ఊహించని రకంగా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. దీనితో ఓటిటి రిలీజ్ తర్వాత మాత్రం మాస్ జాతర పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకోవడం ఒకింత షాకింగ్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.


