MTVలో “కడలి” పాటను విడుదల చెయ్యనున్న రెహ్మాన్

MTVలో “కడలి” పాటను విడుదల చెయ్యనున్న రెహ్మాన్

Published on Nov 3, 2012 4:56 PM IST

MTVలో జరగనున్న ఒక కార్యక్రమంలో ఏ ఆర్ రెహ్మాన్ మణిరత్నం “కడల్” చిత్రంలో ఒక పాటను విడుదల చెయ్యనున్నారు. కదల చిత్రం తెలుగులోకి “కడలి” అనే పేరుతో విడుదల కానుంది. తమిళ వెర్షన్ పాటను ఈరోజు MTVలో విడుదల చెయ్యనున్నారు ఆసక్తికరమయిన విషయం ఏంటంటే ఈ పాటను అయన స్వయాన పాడనున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ చివరి దశల్లో ఉంది. తుఫాను మధ్యలోనే ఈ చిత్ర క్లైమాక్స్ ని చిత్రీకరించారు. ఈ చిత్రంతో గౌతం మరియు తులసి తెరకు పరిచయం కానున్నారు. అరవింద్ స్వామి మరియు లక్ష్మి మంచు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాజీవ్ మీనన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం జాలర్ల నేపధ్యంలో సాగుతుంది. “కడల్” చిత్రం ఈ సంవత్సరంలో భారీ అంచనాల నడుమ రానున్న చిత్రం. చాలా కాలం తరువాత మణిరత్నం ఇటువంటి చిత్రం చెయ్యడం ఈ అంచనాలకు కారణం.

తాజా వార్తలు