స్త్రీల కోసం రెహమాన్ ప్రత్యేక ఆల్బమ్.!

స్త్రీల కోసం రెహమాన్ ప్రత్యేక ఆల్బమ్.!

Published on Dec 23, 2012 11:49 AM IST

ar-rehman
ఒకే సంవత్సరంలో రెండు ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న ఏకైక ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రెహమాన్. ఈ సంవత్సరం కూడా ఆయన సంగీతం అందించిన సినిమాలు ఆస్కార్ కి నామినేట్ అయ్యాయి. ఇటీవలే చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రెహమాన్ ని ఢిల్లీలో స్త్రీలపై జరిగిన అత్యాచారం గురించి మీ స్పందన ఏమిటి అని అడిగితే ‘ ఎంతో భాదాకరమైన విషయం. అందుకే నేను స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలపై ఒక ప్రత్యేక మ్యూజిక్ ఆల్బమ్ చేస్తున్నాను. ఈ ఆల్బమ్ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నానని’ రెహమాన్ అన్నారు. ఆలాగే మాట్లాడుతూ ‘ ఒకే సారి రెండు ఆస్కార్ అవార్డ్స్ అందుకోవడంతో ఆస్కార్ పై ఉన్న మోజు తీరిపోయింది. అలాగే నాకు తమిళ్ , హిందీ , తెలుగు అనే భాషా బేధం ఏమీ లేదు ఏ భాషలోనైనా మ్యూజిక్ చేస్తాను’ అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు