త్రివిక్రమ్ లైనప్ పై క్లారిటీ.. కేవలం ఈ స్టార్స్ తో మాత్రమే మిగతా అంతా నమ్మొద్దు

త్రివిక్రమ్ లైనప్ పై క్లారిటీ.. కేవలం ఈ స్టార్స్ తో మాత్రమే మిగతా అంతా నమ్మొద్దు

Published on Jun 12, 2025 12:03 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా తర్వాత కొత్త సినిమా ఇంకా మొదలు కాలేదు. నిజానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో భారీ సినిమా స్టార్ట్ కావాల్సి ఉంది కానీ ఈ సినిమా పలు కారణాలు రీత్యా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చెంతకి వెళ్ళింది.

ఇక దీనితో పాటుగా త్రివిక్రమ్ లైనప్ పై మరిన్ని రూమర్స్ ఉండగా వీటిలో ఎన్టీఆర్, వెంకీ మామ అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లతో సినిమాలు అంటూ పలు పుకార్లు వచ్చాయి. అయితే వీటిపై ప్రముఖ నిర్మాత నాగవంశీ నుంచి సాలిడ్ క్లారిటీ వచ్చింది.

ప్రస్తుతానికి త్రివిక్రమ్ గారు వెంకటేష్, ఎన్టీఆర్ అన్నతో సినిమాలు మాత్రమే చేస్తున్నారని ఇవి కాకుండా మరో సినిమా ఓకే చేయలేదని ఇతర రూమర్స్ ఎవరూ నమ్మొద్దు ఒకవేళ ఏమన్నా ఉంటే తమ నుంచే దాని తాలూకా వివరాలు బయటకి వస్తాయని క్లారిటీ ఇచ్చారు. సో త్రివిక్రమ్ నుంచి నెక్స్ట్ ఎన్టీఆర్, వెంకీ మామ సినిమాలు మాత్రం ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యాయని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు