84 పైసల కోసం కిడ్నాప్?

84 పైసల కోసం కిడ్నాప్?

Published on Nov 20, 2013 8:30 AM IST

Pratinidhi
మాములుగా మీరు కొన్ని కోట్ల రూపాయల కోసం కిడ్నాప్ చేసారు అనే వార్తలు విని ఉంటారు. కానీ మీరు ఎప్పుడన్నా 84 పైసల కోసం కిడ్నాప్ చేసారు అనే వార్తని విన్నారా? అది కూడా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని కిడ్నాప్ చెయ్యడం? ఇదే కిడ్నాప్ ని నారా రోహిత్ ‘ప్రతినిధి’ సినిమా కోసం చేసాడు.

ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాంగ్రీ యంగ్ మాన్ అయిన రోహిత్ ముఖ్యమంత్రి అయిన కోట శ్రీనివాసరావుని కిడ్నాప్ చెయ్యడమే కాకుండా మొత్తం అడ్మినిస్ట్రేటివ్ సిస్టం ని తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడు. ప్రశాంత్ మండవ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శుబ్ర అయ్యప్ప హీరోయిన్ గా నటించింది. త్వరలోనే రిలీజ్ కావడానికి సిద్దమవుతున్న ప్రతినిధి సినిమాని జె. సాంబశివరావు నిర్మించాడు.

తాజా వార్తలు