సెన్సార్ పూర్తి చేసుకున్న రామయ్యా వస్తావయ్యా

సెన్సార్ పూర్తి చేసుకున్న రామయ్యా వస్తావయ్యా

Published on Oct 7, 2013 7:30 PM IST

RV1
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ మూవీకి ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ బోర్డు వారు సినిమాకి ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ సినిమాలో మాత్రం ఎలాంటి కట్స్ విధించలేదు. ఈ మూవీలో హై వోల్టేజ్ తో కూడిన యాక్షన్ ఎపిసోడ్స్ ఉండడంతో ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.

ఎన్.టి.ఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ పవర్ ప్యాక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని దిల్ రాజు నిర్మించారు. ఎన్.టి.ఆర్ ఎంతో నమ్మకంగా ఉన్న ఈ సినిమా కోసం తన అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు