డాక్టర్ మరియు ఇంజనీర్ నటించిన మొదటి చిత్రం ఈ వారమే విడుదల

డాక్టర్ మరియు ఇంజనీర్ నటించిన మొదటి చిత్రం ఈ వారమే విడుదల

Published on Feb 22, 2012 10:34 AM IST


త్వరలో మన మున్న్దుకు రాబోతున్న ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్’ చిత్రంలో నటిస్తున్న హీరొయిన్ రజిత పూణేలో తన మెడిసిన్ చదువును కొనసాగిస్తూ ఈ సినిమాలో నటించింది.హీరో రేవంత్ అమెరికాలో ఎమ్మెస్ చేస్తున్నాడు. పేస్ బుక్ లో వారి వీడియోలు చూసి ఈ చిత్రానికి ఎంపిక చేసుకోవడం జరిగింది. ఒక డాక్టర్ మరియు ఒక ఇంజనీర్ నటించిన సినిమా ఈ వారం విడుదల కాబోతుంది. రజిత మాట్లాడుతూ నటన తనకు హాబీ అని, కాని తన ముఖ్య లక్ష్యం మాత్రం ఇండియాలో చిన్నారుల కోసం ఒక పెద్ద హాస్పిటల్ కట్టాలని అంటుంది. ఈ చితంలో పాత్ర తన నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. మోడరన్ గా ఉండే అమ్మాయి సంప్రదాయాలు, మోడరన్ మధ్య యువతిగా నటించాను అంటుంది. రేవంత్ మాట్లాడుతూ సినిమాల్లో నటించాలని తన కోరిక అని, ఇండస్ట్రీలో చాలా పోటీ ఉంటుంది, అలంటి సమయంలో ఎలాంటి సపోర్ట్ లేకుండా రానిన్చాలేము. పేస్ బుక్ లో లో నా వీడియోలు చూసి నన్ను ఎంపిక చేసుకున్నారు అన్నాడు.

తాజా వార్తలు