పోటుగాడు సాంగ్ కోసం అరకోటి.!

పోటుగాడు సాంగ్ కోసం అరకోటి.!

Published on Apr 10, 2013 1:00 PM IST

Potugadu
ఇటీవల కాలంలో ఇండస్ట్రీలోని పెద్ద హీరోల సినిమాల కోసం, సాంగ్స్ కోసం కోట్లు ఖర్చు పెట్టి సెట్స్ వెయ్యడం కామన్ అయిపోయింది. అదే కోవలో నేనూ ఏం తక్కువ కాదంటూ మంచు మనోజ్ కూడా ఓ పాత కోసం అరకోటి అనగా 50 లక్షలు ఖర్చు చేసారు. మంచు మనోజ్ హీరోగా నలుగురు హీరోయిన్స్ తో తెరకెక్కుతున్న సినిమా ‘పోటుగాడు’. ఈ సినిమాలోని నలుగురు హీరోయిన్స్ లో సాక్షి చౌదరి, సిమ్రాన్ ముండి, నతాలియా కౌర్ లు ఎంపిక కాగా మరొక హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. ఈ కాస్ట్లీ సాంగ్ ని మనోజ్ – సాక్షి చౌదరి పై బీజపూర్ లో షూట్ చేసారు. సింగల్ షెడ్యూల్ లో సినిమాని కంప్లీట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి పవన్ డైరెక్టర్. శిరీష – శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకి ‘డాన్ 2’ కి పనిచేసిన హాలివుడ్ స్టంట్ మాస్టర్ స్టీఫెన్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నాడు.

తాజా వార్తలు