3G లవ్ పాటకు అనూహ్య స్పందన

3G లవ్ పాటకు అనూహ్య స్పందన

Published on Dec 19, 2012 8:00 AM IST

3g-love
ప్రేమ పలు రకాలు, ఒకప్పుడు నెమ్మదిగా సాగిన ప్రేమ ఇప్పుడు సూపర్ ఫాస్ట్ గా సాగుతుంది ఇదే కాన్సెప్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం “3G లవ్”. గోవర్ధన్ కృష్ణ దర్శకత్వంలో ప్రతాప్ కోలగట్ల నిర్మిస్తున్న ఈ చిత్రంలో 15 మంది హీరోలు మరియు 11 మంది హీరోయిన్ లు నటిస్తున్నారు. వీరందరు నూతన నటీనటులు కావడం విశేషం. ఈ చిత్రంలో ఒక పాటను ఈ మధ్యనే విడుదల చేశారు. “గూగుల్ సెర్చ్ లో” అని సాగే ఈ పాట స్టైలిష్ టేకింగ్ తో తెరకెక్కించారు ఈ పాట యువత దృష్టిని ఆకర్షించింది. “నచ్చవులే” ఫేం శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు