మెగాస్టార్ చిరంజీవి ఇండియాలో బిగ్గెస్ట్ మూవీ స్టార్స్ లో ఒకరు. సీనియర్ ఎన్.టి.ఆర్ గారి తర్వాత చిరంజీవి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. కానీ సూపర్ స్టార్డం దక్కించుకోవడం అనేది అంత సులువైన పనికాదు. చిరంజీవి కెరీర్లో ‘ఖైదీ’ సినిమా ఒక మైలురాయి లాంటిది.
చెప్పాలంటే చిరంజీవి కెరీర్ ని ఖైదీకి ముందు ఒకలా ఖైదీ తర్వాత ఒకలా చూస్తారు. ఈ సినిమా 1983 అక్టోబర్ 28న రిలీజ్ అయ్యింది. అప్పట్లో ఈ సినిమా ట్రెండ్ సెట్ చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కోదండరామి రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ కథని అందించారు. అలాగే ఈ సినిమా సిల్వర్ స్టార్ స్టలోన్ నటించిన ‘ఫస్ట్ బ్లడ్’ సినిమాని ఆధారంగా చేసుకొని తీసారు.
ఈ సినిమాలో చిరంజీవి చేసిన ఫైట్ సీక్వెన్స్ లు మరియు డాన్సులు అప్పటి తరాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మాధవి, సుమలత హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీలో రావు గోపాలరావు విలన్ పాత్ర పోషించాడు. లోక్ సింగ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయగా కె. చక్రవర్తి మ్యూజిక్ కంపోజ్ చేసాడు. ‘ఖైదీ’ సినిమా విడుదలై 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తోంది.