24 గంటలు నాన్ స్టాప్ షూట్ చేసిన మనోజ్

24 గంటలు నాన్ స్టాప్ షూట్ చేసిన మనోజ్

Published on Jul 31, 2013 8:50 AM IST

potugadu-movie-stills

యంగ్ హీరో, మంచు వారబ్బాయి మంచు మనోజ్ ప్రస్తుతం ‘పోటుగాడు’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కోసం మనోజ్, అతని టీం గడియారపు ముల్లుతో పోటీపడి మరి పని చేస్తున్నారు. తాజాగా ‘బుజ్జి పిల్ల’ సాంగ్ షూటింగ్ ఫినిష్ చేసారు. చెప్పాలంటే ఈ పాటని మొత్తం షూట్ చెయ్యడం కోసం ఈ చిత్ర టీం కంటిన్యూగా 24 గంటలు షూట్ చేసారు.

‘అందరికీ గుడ్ మార్నింగ్.. 24 గంటలు నాన్ స్టాప్ గా షూట్ చేసి ‘బుజ్జి పిల్ల’ సాంగ్ పూర్తి చేసాం. ప్రస్తుతం ఇక నా తదుపరి సినిమాల షూటింగ్ కి రెడీ అవుతున్నానని’ మనోజ్ ట్వీట్ చేసాడు. పవన్ వడియార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి అచ్చు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు

తాజా వార్తలు