సెన్సార్ పూర్తైన ‘1000 అబద్దాలు’

సెన్సార్ పూర్తైన ‘1000 అబద్దాలు’

Published on Jul 11, 2013 12:36 PM IST

1000_abaddalu_movie_wallpap

సాయి రామ్ శంకర్ హీరోగా నటించిన సినిమా ‘1000 అబద్దాలు’. ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు నిన్న ముగిశాయి. సెన్సార్ వారు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికేట్ ను జారీచేయడం జరిగింది. సెన్సార్ వారు ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ ని మ్యూట్ చేయమన్నారని సమాచారం. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగియడంతో నిర్వాహకులు ఈ సినిమా విడుదల కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో సాయి సరసన ఎస్తర్ హీరోయిన్ గా నటించింది. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాని చిత్రం మువిస్ బ్యానర్ పై పాలడుగు సునీత నిర్మించారు. ఈ సినిమాలో నాగబాబు, మోహన్ బాబు మొదలగువారు నటించారు.

తాజా వార్తలు