దక్షిణాదికి చెందిన నాలుగు సినీ రంగాలూ ఒకే తాటిపై నిలిచి అంగరంగ వైభవంగా జరుపబోతున్న 100ఏళ్ళ సినిమా పండుగ ఈరోజు సాయంత్రం 4గంటలకు చెన్నై నెహ్రు స్టేడియం లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరియు గవర్నర్ కొణిజేటి రోశయ్య ప్రారంభించనున్నారు. ఈ రోజు సాయంత్రం తమిళ చిత్ర సీమ సంబరాలు, రేపు ఉదయం కన్నడ సినిమా ఆ తరువాత తెలుగు సినిమా వేడుకలు జరగనున్నాయి. 23 న మలయాళం మరియు 24 న వీడ్కోలు సభలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు. ఆఖరి రోజున అన్ని భాషల ప్రముఖులను కలిపి ఏడుగురిని రాష్ట్రపతి సన్మానించనున్నారు ఈ వేడుకలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ వేడుకని భారీ రీతిలో జరుపడానికి తమిళనాడు నిర్మాతల మండలి దాదాపు 30కోట్లు ఖర్చుపెడుతుంది