నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘లెజెండ్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని ప్రొడక్షన్ వారు మార్చి చివర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. గురువారం అనగా రేపటి నుంచి బాలకృష్ణపై ఓ కీలక ఫైట్ సీక్వెన్స్ ని తెరకెక్కించనున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ లో 100 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొననున్నారు.
ఈ షెడ్యూల్ ఒకవారం జరగనుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వారాహి చలన చిత్రం – 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నారు. జగపతిబాబు విలన్ గా కనిపించనున్న ఈ మూవీలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.