పది వసంతాలు పూర్తి చేసుకున్న ప్రొడ్యూసర్

పది వసంతాలు పూర్తి చేసుకున్న ప్రొడ్యూసర్

Published on Apr 6, 2013 3:00 PM IST

Dill-Raju

ఆ ప్రొడ్యూసర్ ది లక్కీ హ్యాండ్. ఆయన చేయ్యిపడితే సినిమా హిట్. ఆయన చేతుల్లో పడితే శిల శిల్పం అవుతుంది. ప్రొఫెషన్ ని ప్లానింగ్ తో చేస్తే విజయం సహజం అని ఋజువుచేసాడు. నేను చెప్పేది ఎవరిగురించో కాదు. ప్రస్తుత తరం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి. 2003లో వి.వి వినాయక తీసిన ‘దిల్’ సినిమాతో ప్రస్థానం మొదలుపెట్టి, అల్లు అర్జున్ ‘ఆర్య’ సినిమాతో చరిత్ర సృష్టించాడు. ‘బొమ్మరిల్లు’లో యువ జంట మధ్య ప్రేమను పలికించినా, ‘ఆకాశమంత’ లో తండ్రీ కూతుర్ల మధ్య ప్రేమను పండించినా అది అతని సంస్థకే సొంతం. సుకుమార్, బోయపాటి శీను, శ్రీకాంత్ అడ్డాల, వంశీ పైడిపల్లి వంటి ప్రతిభ కలిగిన దర్శకులను మన తెలుగు తెరకు పరిచయం చేసిన ఈ సంస్థ మొన్నటితో 10 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో దిల్ రాజు మాట్లాడుతూ “మొదట్లో కొన్ని సినిమాలను పంపిణీ చేసి చాలా నష్టాలలో పడిపోయాం. వినాయక్ తీసిన ‘ఆది’లో తొడకోట్టిన సీన్ చూసి అతనికి అడ్వాన్స్ ఇచ్చెసా. ఒక నిర్మాత కుడా స్టొరీ సిట్టింగ్ లో కూర్చోవాల్సిన అవసరం ఉందని వినాయక్ నాకు ‘దిల్’ సినిమా టైంలో చెప్పిన మాటలు నాకు చాలా సహాయపడ్డాయని”అన్నారు. అతను ఈ ఏడాది ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ద్వారా భారీ విజయం సాదించారు. త్వరలో విడుదల కాబోతున్న రామ్ చరణ్ ‘ఎవడు’ చిత్రానికి కుడా ఈయనే నిర్మాత. పది సంవత్సరాలుగా సక్సస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్న ఈయన సినీ ప్రస్థానం మరింత ఘనంగా ఉండాలని కోరుకుందాం.

తాజా వార్తలు