1 రికార్డ్ ఓపెనింగ్స్ కలెక్ట్ చేస్తుంది – కృష్ణ

Krishna
సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘1-నేనొక్కడినే’ సినిమాని ఈ రోజు తన ఫ్యామిలీతో కలిసి చూసారు. ఆ తర్వాత ఆయన సినిమా పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. ‘ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ సినిమాని షూట్ చేసారు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ లు హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా అన్ని ఓపెనింగ్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందని’ అన్నాడు.

14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాని ఈరోస్ ఇంటర్నేషనల్ వారు డిస్ట్రిబ్యూట్ చేసాడు. సంక్రాంతి సీజన్ మరియు మహేష్ బాబు స్టార్డం ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించగా, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version