ఒక సినిమా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ప్రమోషన్స్ భారీగా ఉండాలి. ఆ విషయంలో 14 రీల్స్ వారు ఎప్పుడు ముందుంటారు. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూపార్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా ‘1-నేనొక్కడినే’. జనవరి 10న భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.
ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర మాట్లాడుతూ ‘మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మరో రెండు రోజుల్లో 1 గేమ్ ని లాంచ్ చేస్తున్నాం. అలాగే కొంతమంది మహేష్ బాబు అభిమానులకు ట్విట్టర్ అకౌంట్స్ లేకపోవచ్చు, అలాంటి వాళ్ళు 8688464077 కి మిస్సుడ్ కాల్ ఇస్తే మహేష్ బాబు పోస్ట్ చేసే ట్వీట్స్ అన్ని మెసేజ్ లుగా వస్తాయి. అలాగే బైక్ కాంటెస్ట్ పెడుతున్నాం – సినిమా చూసిన ప్రతి ఒక్కరు తమ టికెట్ నెంబర్ ని ‘ONE టికెట్ నెం టైపు చేసి 58888′ కి మెసేజ్ చేస్తే లాటరీ ద్వారా ఒక్కరిని సెలెక్ట్ చేసి మహేష్ బాబు మూవీలో వాడిన బైక్ ని అందిస్తాం. మాకు అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిన సినిమా ఇది. తెలుగు ఆడియన్స్ ఇది వరకూ చూడని సినిమా, అలాగే క్లాస్, మాస్ ఆడియన్స్ అందరికీ ఇంతక ముందు చూడని ఓ కొత్త సినిమా చూసాం అనే ఫీలింగ్ తో బయటకి వస్తారు. దానికి మాత్రం 100% గ్యారంటీ ఇస్తాను. 1 అనేది తెలుగు సినిమా రంగంలో బిగ్గెస్ట్ రిలీజ్ అని’ అన్నారు.
జనవరి 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1450 -1500 వందల థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ముఖ్యంగా ఒక్క ఏపిలోనే సుమారు 1250 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.