‘1’ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మహేష్ ను పొగడకుండా వుండలేకపోయాడు. నిజానికి మహేష్ వలనే తాను ఈ సినిమాకు ఇంత కష్టపడ్డానని తెలిపాడు. “మహేష్ బాబు అందగాడు. కానీ నా తపన ఏమిటంటే అతనిని అందంగా చూపిస్తూ, తన నటనను వెలికితీస్తూ, ఎమోషన్ ను క్యారీ చెయ్యడమే” చాలా కష్టమన్నాడు
సుకుమార్ తో గతంలో ఆర్య, జగడం తీసిన తనకి ఇది మూడవ సినిమా అని తెలిపాడు. అంతేకాదు తనకు సుక్కు అంటే చాలా ఇష్టమన్నాడు. రెండవ భాగంలో వచ్చే పార్కింగ్ ఫైట్ లో బయట ఆశల లైట్ లేదని, ఆ సన్నివేశం కోసం చాలా కష్టపడ్డామని, ఫైనల్ అవుట్ పుట్ చూశాక మహేష్ చాలా ఆనందించారని తెలిపాడు
సుకుమార్ ఈ సినిమాకు దర్శకుడు. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాత.దేవి శ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడు. కృతి సనన్ హీరోయిన్.