విడుదలైన 1 గేమ్ టీజర్

1_Nenokkadine
మహేష్ నటించిన ‘1’ సినిమా త్వరలో అదే పేరుతొ గేమ్ రూపంలో మనముందుకు రానుంది. గతంలో బాలీవుడ్ సంస్థ;లు ప్రచారంకోసం ఈ పంధాను అనుసరించాయి. ఇప్పుడు 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అదే పద్ధతిని కొనసాగిస్తుంది

ఈ గేమ్ కి సంబంధించిన టీజర్ ను విడుదలచేశారు. త్వరలో గేమ్ ని కూడా విడుదలచేస్తారు. ఈసినిమా సైకలాజికల్ థ్రిల్లర్ నేపధ్యంలోసాగింది గనుక గేమ్ కుడా అదే రీతిలో వుండచ్చని అంచనా. మొదటిసారిగా మహేష్ బాబు ను పోలిన హీరోను మనం గేమ్ లో చూడచ్చు

సుకుమార్ ఈ సినిమాకు దర్శకుడు. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాత.దేవి శ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడు. కృతి సనన్ హీరోయిన్.

Exit mobile version