మన టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ఇపుడు నటించిన చిత్రం “తెలుసు కదా” రిలీజ్ కి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత తన నుంచి రాబోతున్న కంప్లీట్ మాస్ చిత్రమే “బ్యాడాస్”. దర్శకుడు రవికాంత్ పేరెపు తెరకెక్కిస్తున్న ఈ సినిమా పట్ల మంచి బజ్ అయితే ఇపుడు నెలకొంది.
మరి మేకర్స్ ఈ బజ్ లో భాగంగా సెన్సేషనల్ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ని లాక్ చేసినట్టుగా సాలిడ్ బజ్ ఇపుడు వినిపిస్తుంది. కేవలం తెలుగు సినిమా నుంచే కాకుండా కోలీవుడ్ సినీ వర్గాలు సైతం ఈ టాక్ చెబుతున్నాయి. సో ఈ చిత్రం కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి మాత్రం ఇది నిజమైతే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తుండగా అనిరుద్ పై అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు అందిస్తారో చూడాలి.
is-anirudh-locked-for-star-boy-siddhu-jonnalagadda-bad-ass-dbm