‘మన శంకర వరప్రసాద్ గారు’ పై కేర్ పెంచిన మేకర్స్ !

Mana Shankara Varaprasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” అనే ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఈ సినిమాలో మరో హీరో వెంకటేష్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అలాగే, ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటిస్తోన్న విషయం తెలిసిందే. ఐతే, ఈ సినిమా నుంచి వచ్చిన మీసాల పిల్ల అంటూ సాగే సాంగ్ తాలూకా ప్రోమో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. అయితే, యాంటీ ఫ్యాన్స్ కొందరు ఈ ప్రోమోని ట్రోల్ చేస్తున్నారు. దీంతో మేకర్స్ ఈ సారి ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి కంటెంట్ పై ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇక ఈ మీసాల పిల్ల ఫుల్ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి తన గ్రేస్ తో డామినేట్ చేస్తాడని.. అలాగే భీమ్స్ ఇచ్చిన సంగీతం, ఉదిత్ నారాయణన్ గారు వోకల్స్ కూడా అదిరిపోతాయని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో నయనతార శశిరేఖ పాత్రలో నటిస్తున్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు. ప్రస్తుతం ఓ ప్రత్యేక సెట్‌ లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. అన్నట్టు 2026 సంక్రాంతికి ఈ సినిమాతో ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌ ఇవ్వనున్నట్లు మేకర్స్ ఇప్పటికే చెప్పారు. ఇక అక్టోబర్‌ 5 నుంచి వెంకటేశ్ ఈ షూటింగ్‌లో భాగం కానున్నారు. సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Exit mobile version