పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఇందులో భాగంగా ఈ సినిమాలో తన పాత్ర కోసం ప్రభాస్ కసరత్తులు చేస్తున్నాడు. ఫిట్ గా కనిపించడం కోసం సరికొత్త డైట్ ఫాలో అవుతున్నాడు. పైగా ఈ సినిమాలో హెయిర్ స్టైల్ ను కూడా ప్రభాస్ పూర్తిగా మార్చబోతున్నాడు అని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో త్రిప్తి దిమ్రిని తీసుకున్న విషయం తెలిసిందే. కాగా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశాడు.
ఆ మధ్య హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘ప్రభాస్ తో చేసిన సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ అని, దాన్ని కొనసాగిస్తానని హర్షవర్ధన్ రామేశ్వర్ పేర్కొన్నారు. ఇక స్పిరిట్ సినిమా విషయానికి వస్తే..ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని తెలుస్తోంది. అన్నట్టు హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమా కోసం ఇప్పటికే సాంగ్స్ ను కంపోజ్ చేయడం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.